పహల్గాం ప్రాంతానికి క్యూ కడుతున్న పర్యాటకులు
అమరావతి: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరాన్ వ్యాలీలో ఏప్రిల్ 22వ తేదిన ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 26 మంది పర్యాటకు మరణించారు..ఈ దాడి తరువాత పర్యాటకులు ఈ ప్రాంతంకు వెళ్లేందుకు విముఖత చూపించారు.. పర్యాటకులు రాకపోవడంతో వ్యాలీ మొత్తం ఇన్నిరోజులూ వెలవెలబోయింది..ప్రస్తుతం మళ్లీ అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది..పెద్ద ఎత్తున పర్యాటకులు పహల్గాం ప్రాంతానికి వెళ్లుతున్నారు..ఇందుకు సంబంధించిన ఫొటోలను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా షేర్ చేశారు.. పహల్గాంలో మళ్లీ సందడి నెలకొన్నదని,,దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నారు..జమ్ము కశ్మీర్ పర్యాటక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడాన్ని చూసి చాలా సంతృప్తికరంగా ఉందన్నారు..పర్యాటకుల వాహనలతో నిండిన రోడ్ల ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు.
https://x.com/OmarAbdullah/status/1936785092631802353

