NATIONAL

దేశంలోకి చొరబడిన జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గరు ఉగ్రవాదలు

అమరావతి: దేశంలో ఎదో ఒక రకంగా రక్తపాతం సృష్టించేందుకు ఉగ్రదేశం పాకిస్తాన్ ప్రయత్నిస్తునే వుంది అనేందుకు అగష్టు రెండ వారంలో దేశంలోకి ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గరు ఉగ్రవాదలు ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి..త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రవాదుల చొరబాట్లు కలకలం రేపుతున్నాయి.. నిఘా వర్గాల హెచ్చరికలతో బీహార్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది..అలాగే ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలను కూడా పబ్లిక్‌ డొమైన్ లోకి విడుదల చేసింది..అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కన్పిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది.. ఉగ్రవాదులను రావల్పిండికి చెందిన హస్నైన్‌ అలీ,,ఉమర్‌కోట్‌కు చెందిన అదిల్‌ హుస్సేన్‌,,బహవల్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌గా గుర్తించారు.. వీరు పాక్‌ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహ్మద్‌ ముఠాకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు..వీరు గత వారం నేపాల్‌ మీదుగా బీహార్‌లోకి చొరబడ్డట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.. నేపాల్‌ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *