పుట్టుకతోనే వైకల్యంతో జన్మిచిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కంట తడి పెట్టిన రాష్ట్రపతి..
అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు అంధ విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ “తారే జమీన్ పర్”చిత్రంలోని గీతాలు ఆలపించిన సందర్బంలో భారత రాష్ట్రపతి వేదికపైనే భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టారు..ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీ (NIEPVD)ని సందర్శించారు.. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందంగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు..” పిల్లలు హృదయం లోతుల్లోంచి వచ్చిన పాట”.. వారి మనస్సులోని భావోద్వేగం అర్ధం కావడంతో కన్నీళ్లు ఆగలేదన్నారు..పుట్టుకతోనే వైకల్యంతో జన్మిచిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని, వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు తీసుకువెళ్తే ఒకనాటికి ఖచ్చితంగా వారు లక్ష్యంకు చేరుకుంటారని రాష్ట్రపతి అన్నారు.. వైకల్యంతో ఉన్న పిల్లల సాధికారత, సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం పథకాల రూపకల్పన జరుగుతోందని తెలిపారు..వైకల్యంతో పుట్టిన పిల్లల సాధికారత కోసం పని చేస్తున్న NIEPVDని అభినందించారు.. ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (రిటైర్డ్), ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.