NATIONAL

ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

అమరావతి: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను దారుణంగా చంపిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్ (TRF)ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు,ఇది  ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.. ఏప్రిల్‌ 22న పహల్గాంలో హిందువు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు..ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు..దాడికి పాల్పడింది తామేనంటూ TRF ప్రకటించుకున్నది..

మార్కో రూబియో:- ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ను విదేశీ ఉగ్రవాద ఆర్గనైజేషన్ గా (FTO), ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ (SDGT) ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్నట్లు మార్కో రూబియో ప్రకటించారు..2008 ముంబై ఉగ్రదాడి తరువాత భారత్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో పహల్గాం ఘటనే అతిపెద్దదని వెల్లడించారు..భారత భద్రత దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు TRF బాధ్యత వహించిందన్నారు..

లష్కరేకు మరో పేరు మాత్రమే:- టీఆర్‌ఎఫ్‌ 2019లో లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఏర్పడింది..ఇది లష్కరేకు మరో పేరు మాత్రమే.. పాకిస్తాన్,,ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (FATF) పరిశీలన నుంచి తప్పించుకునేందుకు పాక్‌ ఆర్మీ,ISI  వ్యూహకర్తలు TRF అనే పేరుతో లష్కరే కోర్‌ గ్రూప్‌ను తెరపైకి తెచ్చారు..

కశ్మీరీ పండిట్లతో పాటు:- జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ రద్దు తరువాత ఈ ప్రాంతంలో ఉగ్రదాడులకు పాల్పపడేందుకు,,TRFను పాక్ రంగంలోకి దించింది..గత 4 సంవత్సరాల నుంచి జమ్ముకశ్మీర్‌లో వలస కార్మికులు, కశ్మీరీ పండిట్లతోపాటు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ దాడులకు పాల్పడుతున్నది.. 2021 జమ్ములోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (IAF) స్టేషన్‌పై డ్రోన్‌ దాడులు చేసింది..ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద 2023 జనవరిలో టీఆర్‌ఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *