సింహ గర్జన చాలా దూరం వరకు వినిపిస్తుంది-TVK దళపతి విజయ్
అమరావతిం మా ఏకైక భావజాల శత్రువు బీజేపీ,, మా రాజకీయ శత్రువు డీఎంకే అంటూ తమిళగ వెట్రి కళగం అధినేత సినిమా హిరో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు..2026లో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుల గురించి కూడా క్లారిటీ ఇస్తూ TVK ఒంటరిగా నిలబడుతుందని, ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు.. అడవిలో నక్కలు ఎన్ని ఉన్నా, సింహం ఒక్కటే రాజు అని,,దాని గర్జన చాలా దూరం వరకు వినిపిస్తుందన్నారు.. సింహం ఎప్పుడూ సింహమే అంటూ సమావేశంలో గర్జించారు.. గురువారం మదురైలో నిర్వహించిన రెండో రాష్ట్ర సమావేశంలో అయన మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల్లో తమ పార్టీ, డీఎంకే మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు..అలాగే అలంగనల్లూర్ జల్లికట్టు, మీనాక్షి అమ్మన్ ఆలయం ఇవి అన్ని తమిళ ప్రజల ధైర్యం, సంప్రదాయాలకు చిహ్నాలని గుర్తు చేశారు.. తమిళ జాలర్ల సమస్యలు, కచ్చతీవు తిరిగి తీసుకోవాలనే డిమాండ్, నీట్ రద్దు చేయాలనే అంశాలను ప్రస్తావించారు.. మా పోరాటం మాదే, నేను ముందుండి నడిపిస్తానని స్పష్టం చేశారు.