అమెరికాకు పోస్టల్ సేవలను రద్దు చేసిన తపాలా శాఖ
అమరావతి: భారత్ పై అమెరికా టారిఫ్ ల పేరుతో అనుసరిస్తూన్న ద్వంద ప్రమాణలను భారత్ తీవ్రంగా పరిగిణించింది.. భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ అమెరికాకు పంపే కొన్నిపోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది..ఈ నెల 29వ తేది నుంచి అమల్లోకి వచ్చే US కస్టమ్స్ కొత్త నియమాల నేపథ్యంలో తపాలా శాఖ ఆగస్టు 25 నుంచి అమెరికాకు పంపించే అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది..అమెరికా తీసుకున్న కొత్త టారిఫ్ నిర్ణయం కారణంగా అమల్లోకి వచ్చింది..జూలై 30న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 14324 ప్రకారం, ఇప్పటి వరకూ USD 800 (డాలర్లు) వరకు వస్తువులకు ఇచ్చిన సుంకం మినహాయింపును తొలగించారు.. దీని ప్రభావంతో విదేశాల నుంచి వస్తువులు పంపించడంపై ప్రభావం చూపుతోంది..
ఆగస్టు 25 నుంచి USAకి:- కొత్త ఆర్డర్ ప్రకారం, అంతర్జాతీయ పోస్టల్ నెట్‌వర్క్ లేదా US కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఆమోదించిన ఇతర “అర్హత కలిగిన సంస్థల” ద్వారా సరుకులను పంపిణీ చేసే ట్రాన్స్ పోర్ట్ క్యారియర్స్ సుంకాలను వసూలు చేసి చెల్లించాల్సి ఉంటుంది.. ఫలితంగా, అమెరికాకు వెళ్లే విమానయాన సంస్థలు ఆగస్టు 25 తర్వాత సరుకులను స్వీకరించలేమని భారత అధికారులకు తెలియజేశాయి..ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, 2025 ఆగస్టు 25 నుంచి USA కి ఉద్దేశించిన అన్ని రకాల పోస్టల్ వస్తువుల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని తపాలా శాఖ నిర్ణయించింది..
100 (డాలర్ల) విలువలోపు:- అగష్టు 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ ఐటెమ్స్ బుకింగ్‌ను నిలిపివేస్తోంది..అయితే లెటర్స్, డాక్యుమెంట్స్, $100 (డాలర్ల) విలువలోపు గిఫ్ట్ పార్సెల్స్‌కు మాత్రం అనుమతి ఇస్తోంది.. ఇవి కూడా తాత్కాలికంగానే, ఎందుకంటే అమెరికా నుంచి మరింత స్పష్టత వచ్చే వరకు మాత్రమే ఈ సేవలు కొనసాగుతాయి.
కస్టమర్లకు పోస్టేజ్ రీఫండ్:- డెలివరీ కాని వస్తువులను ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లు పోస్టేజ్ రీఫండ్ కోరవచ్చని ఆ విభాగం తెలిపింది..పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, వీలైనంత త్వరగా సేవలను నార్మలైజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది.