కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయలతో అస్సాంలో బంగ్లా ముస్లింల సంఖ్య 40 శాతం! -సీ.ఎం హిమంత
అమరావతి: అసోం జనాభాలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తూ,,రాష్ట్రంలో వేగంగా మారుతున్న జనాభా నిష్పత్తిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.2027లో జనాభా లెక్కల నాటికి రాష్ట్రంలో బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లింల జనాభా ఏకంగా 40 శాతానికి చేరుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ సంవత్సరాల తరబడి “బుజ్జగింపు రాజకీయాలు” అస్సాం సామాజిక–సాంస్కృతిక ఫాబ్రిక్‌ను బెదిరించే “కొత్త నాగరికత” స్థాయికి దారితీశాయని ఆరోపించారు. శనివారం గువాహాటిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం హిమంత మాట్లాడారు.
3 శాతం మంది స్థానిక అస్సామీ ముస్లింలు:- 2011 జనగణన నాటికి అసోంలో ముస్లింల జనాభా సుమారు 34 శాతంగా ఉందని, అందులో సుమారు 3 శాతం మంది స్థానిక అస్సామీ ముస్లింలను మినహాయిస్తే, బంగ్లాదేశ్ మూలాల ముస్లింల జనాభా దాదాపు 31 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. గత జనగణనల నివేదికలను పరిశీలిస్తే అసోంలో ముస్లిం జనాభా సగటున 4 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, 2027లో జగనణన నాటికి బంగ్లాదేశ్ మూలాల ముస్లింల జనాభా సుమారు 40 శాతానికి చేరుకుంటుందని వెల్లడించారు.
అసోం సాంస్కృతిక అస్థిత్వానికే ముప్పు:- అసోంలో బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లిం జనాభా పెరగడం అనేది ఇది కేవలం రాజకీయ సమస్య కాదని, నాగరికతకు సంబంధించిన సమస్య అని హిమంత స్పష్టం చేశారు. “మన సమాజాన్ని బలహీనపరిచేందుకు జరుగుతున్న కుట్ర ఇది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల వల్ల దాదాపు 1.5 కోట్ల మందితో కూడిన ఒక ‘కొత్త నాగరికత’ క్రమంగా తయారైంది. ఇది అసోం సామాజిక, సాంస్కృతిక అస్థిత్వానికే ముప్పుగా పరిణమిస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

