NATIONAL

కేరళ రాష్ట్రం పేరు ఇక నుంచికేరళం-కేంద్ర కేబినేట్ నిర్ణయం

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కొత్త భవనం ‘సేవా తీర్థ’లో కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది. కేరళ పేరును “కేరళం”గా మార్చడానికి ఆమోదం తెలిపింది. భాష ఆధారంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, కేరళకు కేరళం అని పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. కేబినేట్ తీసుకున్న మరి కొన్ని కీలక నిర్ణయాల వివరాలు మంత్రి ఆశ్వినీ తెలిపారు. రూ.12,236 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాలు, విధానపరమైన నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో రైల్వేలు, అర్బన్ ట్రాన్‌పోర్ట్, ఏవియేషన్, మౌలికసదుపాయాల కల్పన వంటివి ఉన్నాయి. విద్యుత్ రంగం సంస్కరణలపై కూడా విధానపరమైన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *