ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నకేంద్ర ప్రభుత్వం!
అమరావతి: 2026-27ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 31వ తేది నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున జరిగే పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెడతారు.తొలి సారిగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం చరిత్రలో 2026-27 కాబోతోంది. బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. అలాగే 30 రోజులకు పైగా జైలు జీవితం గడిపే సీఎంలు,, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం.
2017 నుంచి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.అయితే, ఈ సారి ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం వచ్చింది. దీంతో ఆ రోజు సెలవు కావడంతో బడ్జెట్ ప్రవేశ పెడతారా? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 2న ప్రవేశపెట్టొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

