NATIONALOTHERSTECHNOLOGYWORLD

ప్రపంచ వ్యాప్తంగా మిలటరీ నిపుణులను ఆశ్చర్యం పరుస్తున్న అకాశ్‌తీర్ డ్రోన్ సిస్టమ్

(తప్పక చదవండి)

US స్టెల్త్ డ్రోన్ సామర్థ్యాలతో సమానంగా…

అమరావతి: ఆత్మనిర్భర్ లో బాగంగా తయారీ అయిన స్వదేశీ అకాశ్‌తీర్(AkashTeer) డ్రోన్ సిస్టమ్ గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మిలటరీ నిపుణులు,,మేధావులు,,శాస్త్రవేత్తలు మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయి.. అమెరికా,,చైనాతో పాటు వెస్ట్రన్ కంత్ర్సీ కూడా తలలు పట్టుకుంటున్నాయి..ఇన్నాళ్లు తామే పెద్ద తొపులం అంటూ డప్పాలు కొట్టుకున్న USA, వారి ఎయిర్ డిఫెన్స్ (హవాక్ AWACS-నిఘా విమానం) వ్యవస్థలని,, చైనా రాడార్లకు అందకుండా తనకు నిర్ధేశించిన లక్ష్యాలను ధ్వసం చేసిన అకాశ్‌తీర్ విధ్వసంపై లెక్కలు తిరిగ రాసుకుంటున్నారు..

ఏథెన్ అనే కెనడియన్ తో పాటు ప్రపంచంలోని మరి కొంత మంది నిపుణలు అభిప్రాయలు…..ఇండియా యొక్క స్వదేశీ అకాశ్‌తీర్ (AkashTeer) డ్రోన్ సిస్టమ్ గురించి చర్చించారు. దాని పూర్తి వివరాలు మీరే చదవండి..

US స్టెల్త్ డ్రోన్ సామర్థ్యాలతో సమానంగా:- ఇండియా పాక్ ల మధ్య ఘర్షణ సందర్భంలో పాకిస్తాన్ వద్ద వున్నచైనా రాడార్‌ లు గుర్తించకుండా దాటి ముందుకు పోయిన భారత్ అకాశ్‌తీర్ డ్రోన్ సిస్టమ్ అమెరికా డిఫెన్స్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది..ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇండియా యొక్క స్వదేశీ అకాశ్‌తీర్ డ్రోన్స్ US విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి అలాగే ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది.. ఎందుకంటే ఇండియా యొక్క స్వదేశీ అకాశ్‌తీర్ డ్రోన్స్, పాకిస్తాన్-చైనా రాడార్లకు దొరకుండా ముందుకు పోయాయి..US డిఫెన్స్ విశ్లేషకులు ఈ సిస్టమ్ ప్రస్తుతం US స్టెల్త్ డ్రోన్ సామర్థ్యాలతో సమానంగా లేదా అధిగమించి ఉండవచ్చు అని అంగీకరించారు..ఇది ఇండియా యొక్క టెక్నాలాజీ పురోగతిని అమెరికా తక్కువగా అంచనా వేసినందుకు అమెరికాలో అంతర్గత సమీక్షలు చేసుకుంటున్నారు..

నెక్ట్స్ జనరేషన్ రియల్-టైమ్ టార్గెటింగ్:- ఇండియాలోని DRDO-భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లు అభివృద్ధి చేసిన అకాశ్‌తీర్,, ISROతో కలసి లోతైన సమన్వయంతో తయారు చేయబడింది..ఇది తదుపరి జనరేషన్ రియల్-టైమ్ టార్గెటింగ్-ఇంటర్‌సెప్షన్ సిస్టమ్.. ఇది ఒకే యంత్రం లేదా ఒకే డ్రోన్ కాదు..ఇది ఒక సిస్టమ్-ఆఫ్-సిస్టమ్స్, ఇది ఉపగ్రహాలు, డ్రోన్స్, గ్రౌండ్ రాడార్‌లు, మొబైల్ వార్ రూమ్‌లు అలాగే AI ప్రాసెసర్‌లను ఒక స్వీయ-అప్‌డేటింగ్, ఆటో-స్ట్రైకింగ్ డిఫెన్సివ్ క్లౌడ్‌గా అనుసంధానం చేస్తుంది..

అకాశ్‌తీర్ ISRO యొక్క కార్టోశాట్-RISAT నుండి లైవ్ ఉపగ్రహం నిఘాను ఉపయోగిస్తుంది..ఇండియా NAVIC (నేవిక్ అంటే భారత్ స్వయంగా తయారు చేసుకున్న GPS)-GPS కాన్‌స్టెలేషన్‌ను ఉపయోగించి ఖచ్చితమైన నావిగేషన్ & టార్గెటింగ్ చేస్తుంది..ఇది రియల్ టైమ్ టార్గెటింగ్ & భూభాగానికి అనుగుణమైన నిర్ణయాధికారాన్ని సాధ్యం చేస్తుంది..US GPS లేదా ఫ్రెంచ్ ఉపగ్రహ రిలేలపై ఆధారపడే దేశాల మాదిరిగా కాకుండా, ఈ సిస్టమ్ 100% దేశీయ నేవీక్ వ్యవస్థపై ఆధారపడి డేటా సార్వభౌమత్వాన్ని ఇస్తుంది..

NAVIC(నావిక్):- ఇండియాకు సంబంధించిన NAVIC కాన్‌స్టెలేషన్ ఉపయోగం అకాశ్‌తీర్‌ను దక్షిణ ఆసియాలో GPS కంటే చాలా నమ్మదగినదిగా పనిచేస్తుంది.. పర్వతాలు & ఎడారుల వంటి కష్టతరమైన భూభాగాలలో నేవీక్ ఖచ్చితమైన టార్గెటింగ్‌ను అందిస్తుంది.. ఇది US లేదా చైనా నుండి GPS-గైడెడ్ సిస్టమ్‌లు తరచుగా సాధించలేని ఖచ్చితమైన దాడులలో అకాశ్‌తీర్‌కు స్థానిక ప్రయోజనాలకు అనుగుణంగా అందిస్తుంది..

సెకన్లలో అకాశ్‌తీర్ తన మళ్లీ వ్యూహాల్ని:- కేవలం సెకన్లలో, అకాశ్‌తీర్ తన మళ్లీ వ్యూహాల్ని మార్చుకోగలదు, లక్ష్యాలను ఎంచుకోగలదు అలాగే డ్రోన్ మార్గాలను రీప్రోగ్రామ్ చేయగలదు.. ఈ జీరో-హ్యూమన్-డిలే లూప్, మానవ ఆధారిత ఆదేశాలపై నడిచే NATO లేదా PLA సిస్టమ్‌లు కంటే టెక్నాలాజీతో పొల్చుకుంటే, కొన్ని మైళ్ళ ముందు ఉండటాన్ని సూచిస్తుంది..

చైనా సైతం ఊహించలేదు-డిఫెన్స్ విశ్లేషకులు:- చైనాకు చెందిన అత్యుత్తమ డ్రోన్ & ఉపగ్రహ సిస్టమ్‌లు (CASC – బీడౌ) ఇప్పుడు ఇండియన్ అల్గారిథమ్‌లను ఎదుర్కోవడానికి రీకాలిబ్రేట్ చేయబడుతున్నాయి..ఇండియా యొక్క కంబాట్ ఉపగ్రహం ప్లస్, AI ఫ్యూజన్‌ను చైనా  ఊహించలేదని డిఫెన్స్ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు..ఈ విషయంలో బీజింగ్ సైనిక ప్రతినిధులు అసాధారణంగా నిశ్శబ్దంగా ఉన్నారు..ఇది నిజమైన వ్యూహాత్మక ఆశ్చర్యానికి సంకేతం…..

టర్కీ బైరక్తర్ డ్రోన్స్‌:- టర్కీ తన బైరక్తర్ డ్రోన్స్‌ పై గర్వంగా ఉంది..అయితే ఇప్పుడు అకాశ్‌తీర్ యొక్క తేలికైన, వేగవంతమైన & స్టెల్తీ డ్రోన్ స్వార్మ్‌లను టర్కీ, కొత్త బెంచ్‌మార్క్‌ గా చూస్తోంది..దింతో టర్కీ అధికారులు ఇప్పుడు AI అప్‌గ్రేడ్‌లను వేగవంతం చేస్తున్నారు..

US-సప్లై చేసిన AWACS:-పాకిస్తాన్ ఆర్మీ యొక్క రాడార్ & ఎయిర్ కమాండ్ సెంటర్‌లు సున్నితమైన ప్రాంతాల సమీపంలోకి అకాశ్‌తీర్ డ్రోన్స్ ఎంట్రీని గుర్తించడంలో విఫలమయ్యాయి..ఎటువంటి సిగ్నేచర్ లేదా ఫ్రీక్వెన్సీని అవి అందుకోలేక వారి రెస్పాన్స్ సిస్టమ్‌లు ఫ్రీజ్ అయ్యాయి..ఇది US-సప్లై చేసిన AWACS & యాంటీ-డ్రోన్ రాడార్‌లపై విశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది..

ఒక ల్యాప్‌టాప్ సైజ్ మొబైల్ కమాండ్ సెంటర్:-అకాశ్‌తీర్ కు సంబంధించిన ప్లగ్-అండ్-స్ట్రైక్ డిప్లాయ్‌మెంట్– ఇది ఒక ల్యాప్‌టాప్-సైజ్ మొబైల్ కమాండ్ సెంటర్ నుండి లేదా కదిలే జీప్‌లో కూడా ఆపరేట్ చేయగలదు.. బహుశా ఇదే ప్రపంచంలోనే అత్యుత్తమంగా గుర్తించబడేటట్లు చేస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *