CRIMENATIONAL

గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు-నిఘా వర్గాలు

అమరావతి: గణతంత్ర దినోత్సవం రోజునా లేదా అంతకు ముందు జనవరి 26వ తేదిన, 26-26 అనే కోడ్ నేమ్ తో ఉగ్రవాద దాడి జరుగుతుందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో బుధవారం ఢిల్లీలో భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ ఉగ్రదాడులకు సహకరించనున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 26న దేశంలోని పలు ప్రాంతాల్లో జరిపే ఈ దాడులకు ’26-26′ అనే కోడ్ నేమ్ పెట్టినట్టు తెలిపాయి. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్, జైష్-ఎ-మొహమ్మద్,,పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ల సహాయంతో ఈ దాడిని ప్లాన్ చేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

దేశంలోని పలు ఆలయాలు, నగరాలతో పాటు అయోధ్యలోని రామాలయం, జమ్మూలోని రఘునాథ్ ఆలయం ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉన్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, పంజాబ్‌ బేస్డ్ గ్యాంగ్‌స్టర్లతో ISI ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. మన దేశంపై దాడులకు మరింత భారీ కుట్ర చేసే అవకాశాలు ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. భధ్రత బలగాలను ముఖ్యమంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో ఉంచారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *