సాప్ట్ వేర్ ఉద్యోగిపై తమిళ నటి లక్ష్మీ మీనన్ దాడి-కేసు నమోదు
అమరావతి: ఐటీ ఉద్యోగినిపై కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో తమిళ నటి లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ముగ్గురిపై,బాధితుడి ఫిర్యాదు మేరుకు ఎర్నాకులం నార్త్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు..పోలీసుల కథనం మేరకు… ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.. కేరళలోని కొచ్చిలో ఒక రెస్టారెంట్ బార్ వద్ద లక్ష్మీ మీనన్,అమె స్నేహితులు, బాధితుడి స్నేహితుడికి మధ్య వాగ్వాదం జరిగింది.. ఈ గొడవ జరిగిన తరువాత నటి లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు బాధితుడిని వెంబడించి,, అతడి కారును అడ్డగించారు..ఆ తరువాత అతడిని బలవంతంగా తమ కారులోకి లాక్కొని దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ కేసులో మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు..నటి లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని,, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.