నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీల కర్కి!
అమరావతి: నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా, నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి(73 ) శుక్రవారం రాత్రి గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌తో ‘జెన్ జెడ్’ ప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్లమెంటును రద్దు చేసి, కర్మిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలంటూ ‘జెన్ జెడ్’ ప్రతినిధులు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు.
నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా:- 971లో లాయర్ గా కెరీర్ ప్రారంభించిన కర్మి,,పదోన్నతులతో 2009లో సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు..అనంతరం 2016లో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి(సీజె)గా చరిత్ర సృష్టించారు. అవినీతి విషయాల్లో నిక్కచ్చిగా వుంటారని పేరు తెచ్చుకున్నారు.వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్‌లో ఆమె మాస్టర్ డిగ్రీ పొందారు. నేపాల్‌లోని త్రిభువన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు.