కాంగ్రెస్ యువరాజు, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ పార్టీలో ఇంకా రాచరిక పాలన కొనసాగుతున్నట్లు కన్పిస్తొంది? యువరాజు అయిన రాహుల్ గాంధీ ఎలాంటి బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలు భారతదేశం శక్తి హీనమైన దేశం అన్న భావన ఇతరదేశాల్లో రాకుండా వుంటుందా? ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా వుండడం???
అమరావతి: మీడియా ముందు భారతదేశ సార్వభౌమత్వాన్ని,,ప్రతిష్టాను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిన కాంగ్రెస్ యువరాజు,ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది..నేపధ్యం…2020 గల్వాన్ వ్యాలీలో చైనాతో జరిగిన ఘర్షణల గురించి రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రలో మాట్లాడుతూ… చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని, ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని చైనాకు సరెండర్ చేశారని ఆరోపించారు..ఈ వాఖ్యలపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్నాసనంలోని న్యాయమూర్తులు అయిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీహ్‌ల బెంచ్ రాహుల్‌గాంధీని ప్రశ్నించింది..?
నిజమైన భారతీయులైతే అలా:- 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తీసుకుందని మీరు ఎలా తెలుసుకున్నారని ప్రశ్నించింది.? మీరు నిజమైన భారతీయులైతే అలా మాట్లాడరు కదా ? మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏమైనా నమ్మదగిన ఆధారాలు ఉన్నాయా? అంటూ అని జస్టిస్ దత్తా ప్రశ్నలు సంధించారు.. ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి లక్నోలో, సైన్యం గురించి రాహుల్ గాంధీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
ఈ విధంగా మాటలు చెప్పకపోతే ఎలా:- రాహుల్ గాంధీ ఇలాంటి మాటలు చెప్పకపోతే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉంటారని అయన తరఫున సీనియర్ లాయర్అ అభిషేక్ సింఘ్వీ వాదించారు..ఇందుకు జస్టిస్ దత్తా స్పందిస్తూ,, మరి ఇలాంటి విషయాలు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.. ఈ కేసును కొట్టివేయాలన్న రాహుల్ విజ్ఞప్తిపై కోర్టు నోటీసు జారీ చేసింది..ఈ కేసు కొనసాగతుందని స్పష్టం చేసింది.

