రాబోయే 3 రోజుల్లో దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్న నైరుతి
అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి పశ్చిమ మధ్య & తూర్పు మధ్య అరేబియా సముద్రం,, కర్ణాటక,, గోవా,, మహారాష్ట్ర,, పశ్చిమ మధ్య & ఉత్తర బంగాళాఖాతం,, మిజోరాం,,మణిపూర్ & నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయ భారత వాతావరణ శాఖ తెలిపింది..రాబోయే 3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ముంబైతో సహా మహారాష్ట్ర,, బెంగళూరుతో సహా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,, తమిళనాడు,, పశ్చిమ మధ్య,,ఉత్తర బంగాళాఖాతం & ఈశాన్య రాష్ట్రాలలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది..

ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు:- దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఢిల్లీ కాంటోన్మెంట్ ప్రాంతంలో ఒక బస్సు, కారు నీటిలో మునిగిపోయాయి..

