స్కూల్ వ్యాన్‌ను, ప్యాసింజర్ రైలు ఢీ-ముగ్గురు విద్యార్దులు మృతి
అమరాతి: రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను, ప్యాసింజర్ రైలు ఢీకొట్టడడంతో ముగ్గురు విద్యార్థులు మరణించగా,,మరో ఆరుగురు విద్యార్దులు తీవ్రంగా గాయపడిన సంఘటన తమిళనాడులోని కడలూరులో మంగళవారం ఉధయం 7:45 గంటలకు చోటు చేసుకుంది..సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..విల్లుపురం-మైలాడుతురై ప్యాసింజర్ ట్రైయిన్ వస్తున్న సమయంలో,,కృష్ణస్వామి విద్యానికేతన్ సీనియర్ సెకండరీ స్కూల్, కుమారపురంకు చెందిన స్కూల్ వ్యాన్ వెళ్లడానికి మూసిన గేటు తెరవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కడలూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ జయకుమార్ తెలిపారు..దీంతో ఆ గేట్ కీపర్‌ను విధులు నుంచి తొలగించినట్లు రైల్వే శాఖ తెలిపింది..
గేటు కీపర్ నిర్లక్ష్యం:- ఈ ప్రమాదం గేటు కీపర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే శాఖ తెలిపింది.. మూసిన గేటును తీయాలని వ్యాన్ డ్రైవర్ అడగగా, కీపర్ గేటు తెరిచినట్లు తెలిసిందని రైల్వే శాఖ పేర్కొంది.. గేటు కీపర్ భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.