రైల్వే టిక్కెట్ రిజర్వేషన్ కన్ఫర్మేషన్ 24 గంటల ముందే..
అమరావతి: రైలు ప్రయాణికులలో ఆందోళనకు ప్రధాన కారణం,, రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్టులను రైల్వేశాఖ విడుదల చేస్తుంది..ప్రస్తుతం వున్న నిబంధనకు బదులుగా కన్ఫర్మేషన్ బెర్తులు,,సీట్లతో ప్రయాణీకుల చార్టులను 24 గంటల ముందే విడుదల చేసే విధానాన్ని అమలు చేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు..ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులు, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి రైళ్లును అందుకొవడానికి వచ్చేవారు,, రైల్వేలు తుది జాబితాను విడుదల చేసే వరకు తమ టికెట్ కన్ఫమ్ అయిందొ లేదొ తేలిక గందరగొళంలో వుంటారు..ఇలాంటి గందరగొళ పరిస్థితులకు తెర దించేందుకు పైలెట్ పద్ధతిలో 24 గంటల ముందే లిస్ట్ విడుదల చేసే ప్రాజెక్టును చేపడుతున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటన చేసింది..
ఒకవేళ ప్రయాణికుల నుంచి పాజిటివ్ స్పందన వస్తే, అప్పుడు ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు..24 గంటల ముందే చార్ట్ ప్రిపరేషన్‌పై పైలెట్ ప్రాజెక్టును బికనీర్ డివిజన్‌లో చేపడుతున్నామన్నారు.. రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ,, వెయిటింగ్ లిస్టు కేటగిరీలో ఉన్న ప్రయాణికులు తమ ప్రయాణం గురించి ఆందోళన చెందుతున్నారని,, వాళ్లను దృష్టిలో పెట్టుకుని 24 గంటల ముందే టికెట్ కన్ఫర్మేషన్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు..ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయితే,, ఆ ప్యాసింజెర్ టికెట్‌ను రద్దు చేస్తే అప్పుడు అతను ఎక్కువ అమౌంట్ కోల్పోయే ప్రమాదం ఉంది.. క్యాన్సలేషన్ పాలసీ ప్రకారం రైలు బయలుదేరడానికి 12 నుంచి 48 గంటల మధ్య కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేస్తే,,అప్పుడు టికెట్ అమౌంట్‌పై 25 శాతం మాత్రమే వెనక్కి ఇచ్చేస్తారు.

