ఐదు అంచల భద్రత వలంయంలో రేపటి నుంచి పుతిన్ పర్యటన
అమరావతి: ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన అధినేతల్లో ఒకరు అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంనేందుకు గురు,,శక్రవారల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించే ఐదు అంచెల భద్రతా వలయం పుతిన్ చుట్టూ ఏర్పాటు చేస్తారు..ఒకటి,రెండు అంచెల వలయంలో రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది మాత్రమే ఉంటారు.,మూడో అంచ నుంచి సెక్యూరిటీ వలయంలో భారత్‌కు చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG) కమాండోలు, దిల్లీ పోలీసులు ఉంటారు.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) భద్రత కల్పిస్తుంటుంది.
వారం క్రిందటే భారత్ కు:- రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ విభాగానికి చెందిన దాదాపు 50 మంది అత్యున్నత స్థాయి భద్రతా సిబ్బంది వారం క్రిందటే దిల్లీకి చేరుకున్నారు. పుతిన్ బస చేయనున్న హోటల్‌ను వారు పూర్తిగా అదుపులోకి తీసుకుని ప్రతి అంగుళం శానిటైజ్ చేస్తారు. పుతిన్ సందర్శించనున్న ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలతో పాటు సదరు మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను, పరిశుభ్రతా చర్యలను చేపడుతారు. అవసరం అనుకున్న అన్ని చోట్లలో జామర్లు ఏర్పాట్లు,, AI టెక్నాలజీతో కూడిన డ్రోన్లు, ముఖ గుర్తింపు కెమెరాలతో పుతిన్ రాకపోకలు సాగించే రూట్లపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. పుతిన్ కారులో ప్రయాణించే మొత్తం రోడ్డు మార్గానికి పెద్దసంఖ్యలో స్నైపర్లు పహారా కాస్తారు. పుతిన్ భద్రతా ఏర్పాట్లను లైవ్‌లో గురువారం సాయంత్రం భారత రాజధాని దిల్లీకి పుతిన్ చేరుకున్న మరుక్షణం రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ టీమ్ యాక్టివేట్ అవుతుంది.ఐదు అంచెల భద్రతా వలయం సెక్యూరిటీ మిషన్ మొదలవుతుంది. చిరకాల మిత్రులైన మోదీ,,పుతిన్ ల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగునున్నాయనే విషయంపై ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

