సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
అమరావతి: రెండు దశాబ్దాల తరువాత సైప్రస్‌లో భారత ప్రధాని ఒకరు పర్యటించడం ఇదే తొలి సారి..సైప్రస్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ ను సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ప్రధానం చేశారు..ప్రధాని ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.. సైప్రస్ ప్రభుత్వ అందచేసిన ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబకం అనే భావనకు ప్రతీక అని అన్నారు.. రెండు దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు..అవార్డును అందుకుంటున్న వీడియోను ప్రధాని మోదీ “ఎక్స్”లో పంచుకున్నారు.. సైప్రస్,,కెనడా,, క్రొయేషియలో ప్రధాని మోదీ పర్యటన సాగనున్నది..ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం సైప్రస్ చేరుకున్న ప్రధానికి నికోస్ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు.. సైప్రస్ పర్యటన అనంతరం కెనడాకు మోదీ బయలుదేరి వెళ్లాతారు..కెనడాలో జరుగనున్న G-7 సదస్సులో పాల్గొంటారు.. చివరిగా క్రొయేషియాలో అధికారిక పర్యటన జరుపుతారు.