సేవాతీర్థ్ భవన సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: బ్రిటీష్ వలస పాలన ఆనవాళ్లను పూర్తిగా మర్చివేస్తూ, దేశ పరిపాలన కార్యక్రమాలకు కేంద్రంగా సేవాతీర్థ్ భవన సముదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అధికారికంగా ప్రారంభించారు. దీంతో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కర్తవ్య భవన్ 1, 2 లను ప్రధాని ప్రారంభించారు. ఈ బ్లాక్ నుంచి పీఎంవో కార్యాలయంతో సహా క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి కార్యాలయం విధులు నిర్వర్తిస్తాయి.
పౌరులందరూ దేవుడితో సమానమనే అర్థ వచ్చేలా పదాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు మనోహల్ లాల్, జితేంద్ర సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన భవనాల్లో పూజలు చేసిన అనంతరం మహిళలు, యువత కోసం తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. “లక్పతి దీదీ” పథకంలో లబ్ధిదారుల సంఖ్యను 6 కోట్లకు పెంచడమే లక్ష్యంగా పీఎం రహత్ పథకంపై ప్రధాని మోదీ సంతకం చేశారు. అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయల నిధిని రూ.లక్షల కోట్లకు పెంచే దస్త్రలపై సంతకం చేశారు.
కర్తవ్య భవన్-1,,2 ల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్య మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, చట్టం-న్యాయ మంత్రిత్వ శాఖ, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ-గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఇక్కడి నుంచి విధులు నిర్వహిస్తారు.
“ఈ భవన సముదాయాలలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్, నిఘా నెట్‌వర్క్ లు-అధునాతన అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు వుంటాయి. అలాగే సమగ్ర భద్రత పరమైన ఏర్పాట్లు చేశారు.ఈ దిని వల్ల అధికారులు,,సందర్శకులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.

