ఢిల్లీలో నూతన సంవత్సర సందర్బంగా హాట్‌స్పాట్‌లపై పోలీసుల దాడులు
350 మంది అరెస్ట్..
అమరావతి: ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పౌరుల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ ఆఘాత్’ పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆపరేషన్‌లో దక్షిణ ఈశాన్య జిల్లాలోని హాట్‌స్పాట్‌లపై జరిగాయి.ఈ సోదాల్లో 350 మంది నేరస్థులను అరెస్ట్ చేశారు. 40కు పైగా ఆయుధాలు,,డ్రగ్స్ లాట్లు, అక్రమ మద్యం, లక్షల రూపాయల నగదు జప్తు చేశారు.దాదాపు1,306 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సౌత్ ఈస్ట్ హేమంత్ తివారీ తెలిపారు. ఈ ఆపరేషన్ నగరంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్‌వర్క్ లను ధ్వంసం చేయడం, వారి నేర కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా జరిగింది. ఈ దాడులు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరిగేందుకు ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

