మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ చేసిన పోలీసులు
అమరావతి: మావోయిస్టు అగ్రనేత హిడ్మా (కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్) ను ఒడిశాలో జిల్లా వాలంటరీ ఫోర్స్ ను ఉపయోగించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు..2026 మార్చి చివరి నాటికి మావోయిస్టులను దేశం నుంచి ఏరివేతలో భాగంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది..వరుసగా ఆగ్రనేతలము అని చెప్పుకునే మావోయిస్టులను ఏరివేస్తోంది.. ఇటీవల మావోయిస్టు అగ్రనేత బసవరాజుతొ సహా 30 మందికి పైగా మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు..దింతో వణుకు పట్టుకున్న మావోయిస్టులకు కాల్పులు విరమణ కావలంటే పౌరహక్కుల నేతల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నించారు..అయితే ఇలాంటి ఒత్తిడికి తలొగ్గని కేంద్రం,,మావోయిస్టులను ఏరివేయడంను ముమ్మరం చేసింది..దింతో కొందరు మావోయిస్టు అగ్ర నేతలు తాము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసులకు సమాచారం అందిస్తున్నట్టు ప్రచారం జరిగింది..ఈ నేపధ్యంలోనే పోలీసులు హిడ్మాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు..ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్‌గూడ గ్రామానికి సమీపంలో ఉన్న అటవీప్రాంతంలో హిడ్మాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.. అతడి వద్ద అతని వద్ద ఒక AK-47 రైఫిల్, 35 రౌండ్ల మందుగుండు సామగ్రి, 117 డిటోనేటర్లు (ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్), గన్‌పౌడర్, రేడియోలు, కత్తులు,మావోయిస్టు సాహిత్యం సామగ్రిని స్వాధీనం చేసుకుని తెలిపారు.. “బుధవారం రాత్రి ఛత్తీస్‌గఢ్ నుంచి కొంతమంది మావోయిస్టులు ఆంధ్రా వైపు నుంచి కోరాపుట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని మాకు కొంత సమాచారం అందింది..ఆ తర్వాత మేము ఒక ఆపరేషన్ ప్లాన్ చేయడం జరిగింది..జిల్లా పోలీసు ప్రణాళిక ప్రకారం డివిఎఫ్ వెళ్లి ఆపరేషన్ నిర్వహించింది” అని కోరాపుట్ పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ వర్మ మీడియాకు తెలిపారు..
కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్:- మావోయిస్టు వర్గాల్లో హిడ్మాగా పేరుపొందిన కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్ ఒడిశా,,ఛత్తీస్‌గఢ్,, ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. మావోయిస్టుల్లో 2007లో 14 సంవత్సరాల వయసులో ఆ సంస్థలో చేరినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.. అతన్ని మావోయిస్టుల సాంస్కృతిక విభాగం అయిన బాల సంఘం-జన నాట్య మండలి (JNM)లో చేర్చారు.

