ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాద బాధితులను పరామర్శించి ప్రధాని మోదీ
అమరావతి: అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకే ఒక వ్యక్తి రమేశ్ విశ్వాస్ కుమార్(38)… కర్మసిద్దాతం అంటే ఇదేనేమో…. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు.. ప్రమాదంలో విశ్వాస్ కు ఛాతీ, కళ్లు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి ప్రస్తుతం విశ్వాస్ అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..శుక్రవారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ,,అక్కడి నుంచి నేరుగా సివిల్ ఆసుపత్రికి వెళ్లి,,అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు..
ఈ క్రమంలో విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేశ్‌ను కూడా మోదీ పరామర్శించారు.. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకుని,,అతడికి ధైర్యం చెప్పారు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు..బ్రిటిష్ పౌరసత్వం కలిగిన రమేశ్ విమానంలో 11A సీటులో కూర్చున్నారు..ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వెనుక ఈ సీటు ఉంటుంది..తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్‌కు వచ్చిన రమేశ్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేశ్(45)తో కలసి లండన్‌కు తిరుగు ప్రయాణమయ్యారు..విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వినిపించిందని,,అంతలోనే విమానం కూలిపోయిందని ప్రధానికి తెలిపాడు.