నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నమీబియా ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విచ్చియా మిరాబిలిస్’ను బుధవారం ప్రధానం చేశారు..నమీబియా అధ్యక్షురాలు డాక్టర్ నెటుంబో నంది-ఎన్ ద్వైతా ఈ అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు..నమీబియాతో పాటు ప్రపంచ శాంతి, న్యాయం, సామాజిక ఆర్థిక అభివృద్ధికి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సేవలను అధ్యక్షురాలు ప్రశంసించారు.. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ‘వెల్‌విచ్చియా మిరాబిలి’తో అందుకోవడం చాలా ఆనందంగా ఉందని,, నమీబియా అధ్యక్షురాలు, ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..ఇండియా-నమిబియా మధ్య ఎప్పటికీ చెక్కుచెదరని చిరకాల స్నేహం ఉందని,, ఈరోజు ఇక్కడ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.. కష్టకాలంలో ఉన్నప్పుడు చేయూత నిచ్చినవారే నిజమైన మిత్రులని, స్వాతంత్ర్య పోరాటం సమయం నుంచి ఒకరికొకరు బాసటగా ఇండియా, నమీబియా నిలబడ్డాయని తెలిపారు..ఇరుదేశాల మైత్రి రాజకీయాల నుంచి పుట్టిన మైత్రి కాదని, పరస్పరం ఎదుర్కొన కష్టాలు, సహకారం, పరస్పరం విశ్వాసం నుంచి బలపడందని చెప్పారు.. భవిష్యత్తులో కూడా ఇరుదేశాలు మైత్రీ సంబంధాలతో అభివృద్ధి పథం దిశగా పయనించనున్నాయని అన్నారు.. 5 దేశాల పర్యటనల్లో భాగంగా తుదిగా నమీబియాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు..నమీబియా అద్యక్షురాలితో ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానిమోదీ పాల్గొన్నారు.. ఇంధన, హెల్త్ కేర్ వంటి రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఇండియా-నమీబియా మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.