NATIONALOTHERSTECHNOLOGY

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఇది భారత దేశానికి గర్వకారణం..

అమరావతి: ఇంద్రప్రస్థలో ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌ పోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ పోలో పాల్గొన్న స్టార్టప్‌లతో మోదీ సంభాషించారు. వివిధ స్టాళ్లను సందర్శించిన ప్రధాని, ఎక్స్‌ పోలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఢిల్లీలోని భరత్ మండపం వేదికగా AI-INDIA ఇంపాక్ట్ సమ్మిట్ 2026’కు ఆతిథ్యం ఇస్తుంది.ఈ సమ్మిట్ కు హాజరు అవుతున్న ప్రతినిధులను ఉధ్దేశించి,ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచ నాయకులు, పరిశ్రమల నాయకులు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, పరిశోధకులు-సాంకేతిక ఔత్సాహికులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మానవ-కేంద్రీకృత పురోగతి కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడానికి మన ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించే అందరి సంక్షేమం, అందరి కోసం ఆనందం అనే ఈ శిఖరాగ్ర సమావేశం జరగడం అభినందనీయమని,, ఇది భారత దేశానికి గర్వకారణం అన్నారు. అలాగే భారత యువత సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తోందని, సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచ అభివృద్ధికి భారత్​ సహకారాన్ని అందిస్తోందనడాన్ని ఈ సమ్మిట్ మరింత బలపరుస్తుంది’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఏఐ ఎక్స్‌ పో:- ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఏఐ ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ దిల్లీలోని మండపంలో జరగనుంది. ఈ సమ్మిట్​తో పాటు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్​పో’ కూడా జరుగుతుంది.70,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఈ ఎక్స్​పో ఉంటుంది. గ్లోబల్ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల పాల్గొనున్నాయి. ఈ ఎక్స్​పోలో ఏఐ ఎకోసిస్టంలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ 13 దేశాల పెవిలియన్​లను ఏర్పాటు చేశారు. పీపుల్-ప్లానెట్- ప్రోగ్రెస్ అనే మూడు ప్రధాన థీమ్​లుగా ఈ ఎక్స్​పోను విభజించారు.300కి పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, ప్రత్యక్ష డెమో ప్రదర్శనలు జరుగుతాయి. వ్యవసాయం నుంచి విద్య, ఆరోగ్యం వరకు వివిధ రంగాల్లో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు.

స్టార్టప్‌లకు వేదిక:- 600కి పైగా హై-పొటెన్షియల్ స్టార్టప్‌లు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు వాస్తవ జీవితంలో ఉపయోగిస్తున్న AI సొల్యూషన్లు ఉన్నాయి.2.5 లక్షలకు పైగా సందర్శకులు వస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3,250కి పైగా స్పీకర్లు, ప్యానెలిస్టులతో 500కు పైగా సెషన్లు నిర్వహించనున్నారు. ఏఐ గవర్నెన్స్ నుంచి ఇండస్ట్రీ అప్లికేషన్ల వరకు చర్చలు జరుగుతాయి. ఏఐ ఇండియా ఇంపాక్ట్ గ్లోబల్​ సౌత్​లో జరగుతున్న తొలి అంతర్జాకీయ సమ్మిట్​గా గుర్తింపు పొందింది. ఈ సమ్మిట్​లో ఇండియా ఏఐ మిషన్​ కింద 12 స్వదేశీ AI ఫౌండేషన్ నమూనాలను ఆవిష్కరిస్తారు. భారత డేటాసెట్‌లపై శిక్షణ పొంది, దేశంలోని 22 అధికారిక భాషలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *