గౌహతిలో మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభించిన ప్రదాని మోదీ
అమరావతి: గౌహతిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ టెర్మినల్ ‘బ్యాంబు ఆర్కి్డ్స్’అనే కాన్సెప్ట్ తో రూ.4 వేల కోట్లతో నిర్మించారు. అంతేకాదు భారతదేశపు మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్. విమానాశ్రయ నుంచి సంవత్సరానికి దాదాపు 1.3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఇది ఈశాన్య భారతంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా రూపొందించారు.1.40.000 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. లక్ష దేశీయ మొక్కలతో కూడిన ‘స్కై ఫారెస్ట్’ ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. డీజీయాత్ర సౌకర్యం, ఫుల్ – బాడీ స్కానర్లు, అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ టెర్మినల్ ఆగ్నేయ ఆసియాకు గేట్ వేగా, ఈశాన్య భారత్ కి ఏవియేషన్ హబ్ గా ఉండలానే లక్ష్యంతో నిర్మించారు.ఇక్కడ విమానాల ఓవర్ హాలింగ్ సదుపాయం కల్పించారు.

