ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించి ప్రదాని మోదీ
అమరావతి: తొలి సారి ఈశాన్య రాష్ట్రం అసోం చారిత్రక సంఘటన శనివారం జరిగింది. అసోంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటిలీ(ELF)ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జాతీయ రహదారి, దిబ్రూగడ్‌లోని మొరాన్ బైపాస్ వద్ద తీర్చిదిద్దిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) పై C 130 J విమానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ల్యాండయ్యారు.తొలుత చబువా ఎయిర్‌ఫీల్డ్ కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ C 130 J విమానం ఎక్కి మొరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిలో దిగారు. అదే ELF పై ఆధునిక యుద్ధ విమానాలైన రఫేల్, సుఖోయ్-30, హెలికాఫ్టర్లు 40 నిమిషాల పాటు చేసిన విన్యాసాలను ప్రధాని తిలకించారు. అంతుకుముందే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ గురించి ప్రధాని మోదీ తన సోషల్ మీడియాతో ఖాతాలో పోస్ట్ చేశారు.అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం లభించడం చాలా గర్వకారణం. వ్యూహాత్మక దృక్కోణం పరంగా ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో, ఈ సౌకర్యం చాలా కీలకమైనదని పేర్కొన్నారు.

