ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో టెలిఫోన్ ద్వారా సంభాషించిన ప్రధాని మోదీ
అమరావతి: ఉక్రెయిన్లో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోమవారం టెలిఫోన్ ద్వారా సంభాషించారని ప్రధాన మంత్రి కార్యాలయంలో పేర్కొంది..ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ దేశ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలపై తన అభిప్రాయాలను భారత ప్రధానితో పంచుకున్నట్లు సమాచారం.. ప్రాంతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ సమాజం స్పందన వంటి అంశాలపై కూడా తన అభిప్రాయాలు వెల్లడించారు..
శాంతియుత పరిష్కారం:- సంభాషణలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారం సాధించే దిశగా భారతదేశం ఎప్పటికీ నిలకడైన,, స్థిరమైన వైఖరిని పాటిస్తుందని మరోసారి స్పష్టం చేశారు..త్వరగా దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు సహాయపడే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.. ఈ క్రమంలో అవసరమైన సహాయం అందించడానికి భారత్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, సాధ్యమైనంత తొందరగా శాంతి పునరుద్ధరించడమే తమ ప్రాధాన్యం అని ప్రధాని మోదీ,,జెలెన్ స్కీ కి స్పష్టం చేశారు..
ఇరుదేశాలు సన్నిహితంగా:- ఇరు దేశాధినేతలు భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పురోగతిపై సమీక్షించుకున్నారు..వ్యాపారం,,పెట్టుబడులు,, సాంకేతిక రంగం,,విద్య,, మానవతా సహాయం వంటి విభాగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే దిశగా చర్చించారు.. భవిష్యత్తులో కూడా ఇరుదేశాలు సన్నిహితంగా సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారు.