భారత గూఢచార సంస్థ “రా” నూతన అధిపతిగా పరాగ్ జైన్
అమరావతి: కేంద్ర ప్రభుత్వం శనివారం పంజాబ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ (IPS) అధికారి పరాగ్ జైన్‌ను నూతన రీసెర్చ్ & అనాలిసిస్ వింగ్ (RAW) చీఫ్‌గా నియమించింది.. జూన్ 30వ తేదిన ప్రస్తుత చీఫ్‌గా వ్యవహరిస్తూన్న రవిసిన్హా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు., జైన్ జూలై 1, 2025న రెండేళ్ల స్థిర పదవీకాలానికి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
హ్యూమన్ ఇంటెలీజెన్స్:- ప్రస్తుతం ఆయన రాలోని ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) విభాగానికి సారథ్యం వహిస్తున్నారు..ఈ విభాగం దేశ గగనతల నిఘాకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది..భారతదేశ ఇంటెలీజెన్స్ వర్గాలు పరాగ్‌ను సూపర్ స్పై అని పిలుస్తుంటాయి.. హ్యూమన్ ఇంటెలీజెన్స్,,టెక్నికల్ ఇంటెలీజెన్స్ లను ఎంతో నైపుణ్యంతో వినియోగించుకోవడంలో ఆయనకు తిరుగులేదని చెబుతుంటారు..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఎలాగో పరాగ్‌ను చూసి నేర్చుకోవాలని ఇంటెలీజెన్స్ వర్గాలు వ్యాఖ్యనిస్తాయి.. చండీగఢ్‌లో SSP హోదాలో,,లూధియానాలో DIGగా బాధ్యతలు నిర్వహించారు..2021 జనవరి 1వ తేదిన పరాగ్‌కు పంజాబ్ DGPగా పదోన్నతి లభించింది.
ఆపరేషన్ సిందూర్:- కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత…. ఆపరేషన్ బాలాకోట్ నిర్వహించినప్పుడు RAW తరఫున జమ్మూకశ్మీరులో పరాగ్ విధులు నిర్వహించారు..ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్,,పాక్ ఆక్రమిత కశ్మీరు (POK)లోని ఉగ్ర స్థావరాలు,,సైనిక సదుపాయాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది..ఇందుకు అవసరమైన కీలక సమాచారాన్ని కొన్నేళ్ల శ్రమతో సేకరించి,,భారత సేనలకు అందించిన అధికారిగా అయన పేరు నిలిచిపోయింది.. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాద కుట్రలకు చెక్ పెట్టేందుకు ఆయనకు వున్నసుదీర్ఘ అనుభవం భారత్‌కు కలసి వస్తుంది.