NATIONAL

దేశవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్ ఏర్పాటు-హోంమంత్రి అమిత్ షా

అమరావతి: మాదకద్రవ్యల రవాణాను నిరోధించేందుకు దేశవ్యాప్తంగా పటిష్ఠమైన ‘సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్’ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.సోమవారం డిల్లీ పోలీసు వ్యవస్థ 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. “రాబోయే కొద్ది నెలల్లోనే కొత్త “జాతీయ భద్రతా రక్షణ నిర్మాణాన్ని” ఏర్పాటు చేస్తామన్నారు.ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే అని తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్:- దిని కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఒక భారీ సీసీటీవీ నెట్‌వర్క్‌ ను సృష్టిస్తామని,,వీటిని పర్యవేక్షించడానికి “ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్” ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని సమూలంగా అంతం చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ నిఘా వ్యవస్థకు చట్టపరమైన రక్షణ కూడా కల్పిస్తామని,, దీని వల్ల మాదకద్రవ్యల నేరాలను రియల్ టైమ్‌లో పసిగట్టడం సులభమవుతుంది అని హోం మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో దశాబ్దాలుగా దేశాన్ని భయపెడుతున్న నక్సలిజం సమస్యకు ఈ సంవత్సరం మార్చి 31 నాటికి శాశ్వతంగా చరమగీతం పాడబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు భారతదేశ అంతర్గత భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

ఢిల్లీ పోలీసులు:- దేశ రాజధాని రక్షణలో ఢిల్లీ పోలీసులు చురుగ్గ వ్యవహరిస్తున్న తీరును మంత్రి అమిత్ షా కొనియాడారు. పార్లమెంట్ పై ఉగ్రదాడి కేసు, ఎర్రకోట సమీపంలో ఉగ్రవాదుల బాంబు పేలుడు కేసు అయినా ఛేధించడంలో డిల్లీ పోలీసులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. క్లిష్టమైన కేసులను ఛేదించడంలో వారి నైపుణ్యం అద్భుతం అని, దేశ రక్షణలో వారు చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు.2029 నాటికి దేశం ఎదుర్కొంటున్న అన్ని భద్రతా సవాళ్లను సమన్వయంతో, నిరంతర కృషితో అధిగమిస్తాం అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *