అవినితి, సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్ ప్రధాని ఓలి రాజనామా
అమరావతి: నేపాల్ లో గత వారం సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై నిషేధంతో దేశంలోని యువత ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం నిరసనలకు పిలుపునిచ్చారు.. నిరసనలు హింసాత్మకంగా మారడం,,పోలీసుల కాల్పుల్లో 16 మంది మరణించడంతో పరిస్థితి చేయ్యి దాటిపోతుందని గమనించిన ప్రభుత్వం వెనక్కు తగ్గింది..
నేపాల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ సోమవారం రాత్రి అత్యవసర కేబినెట్ సమావేశం తర్వాత సోషల్ మీడియా సైట్‌లను నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అయినా మంగళవారం ఉదయం దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ప్రధాని పదవికి కెపి శర్మ రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
నిరసనలు తగ్గకపోవటంతోపాటు వరుసగా మంత్రులు రాజీనామా చేస్తుండటంతో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. మరోవైపు ప్రధాని రాజీనామా చేయాలంటూ నిరసనకారులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేశారు..
నేపాల్ ప్రధాని రాజీనామా వెనకాల విదేశీ శక్తులు ఏవైన “రేజీమ్ ఛేయింజ్ “కోసం కుట్రలు ఏమైన పన్నాయా ? అనేది నిలకడపై తెలుస్తుంది.?