జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు
అమరావతి: జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు చోరబడినట్లు నిఘా వర్గాలు వెల్లడించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేసిట్లు భద్రతదళాల అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లు తెలిపారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు 0 స్థాయికి పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శీతకాలంలో జమ్మూ కశ్మీర్‌లో మంచు కురుస్తుండటంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని (BSF) భద్రతా దళం అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను తమ దళాలు తిప్పికొడుతున్నాయన్నారు. సరిహద్దుల్లో ఉగ్ర కదలికల నేపథ్యంలో కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించినట్లు తెలిపారు.

