బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధన రద్దు
అమరావతి: జాతీయ బ్యాంకుల్లో సేవింగ్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధనను RBI తొలగించింది..దింతో దేశంలోని అగ్రగామి బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ లేకుంటే విధించే ఛార్జీలను పూర్తిగా రద్దు చేశాయి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:-2020 నుంచి మినిమం బ్యాలెన్స్ ను వసూలు చేస్తున్న SBI ప్రస్తుతం దానిని కూడా రద్దు చేసింది.ఇకపై సేవింగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ పాటించకపోయినా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.
బ్యాంక్ ఆఫ్ బరోడా:- జూలై 1, 2025 నుంచి కనీస బ్యాలెన్స్ షరతులను అన్ని సేవింగ్ ఖాతాలపై విధించే ఛార్జీని బ్యాంక్ ఆఫ్ బరోడా రద్దు చేసింది. కానీ, ప్రీమియం సేవింగ్ ఖాతా పథకాలపై ఈ ఛార్జీని రద్దు చేయలేదు.
ఇండియన్ బ్యాంక్ :- ఇండియన్ బ్యాంక్ కూడా కనీస బ్యాలెన్స్ ఛార్జీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 7, 2025 నుంచి అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కెనరా బ్యాంక్:- మే నెల నుంచి సాధారణ సేవింగ్ ఖాతాలతో సహా అన్ని రకాల పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని కెనరా బ్యాంక్ రద్దు చేసింది. వీటిలో శాలరీ, NRI సేవింగ్ ఖాతాలు కూడా ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్:- పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా:-మినిమం బ్యాలెన్స్ ను సేవింగ్ ఖాతాల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు నిర్ణయం తీసుకుంది.

