పెను ముప్పు నుంచి తప్పించుకున్న మహారాజా ఎక్స్ ప్రెస్
అమరావతి: అత్యంత విలాసవంతమైన పర్యాటక రైళ్లలో ఒకటైన మహారాజా ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించికుంది. ఈ రైలును ప్రమాదానికి గురిచేయడానికి జరిగిన ఒక పెద్ద కుట్రను లోకో పైలట్ అప్రమత్తమై భగ్నం చేశారు. ఈ రైలు విదేశీ పర్యాటకులతో జైపూర్ నుంచి సవాయ్ మాధోపూర్ వైపు వెళ్లుతొంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో శివదాస్‌పురా ప్రాంతంలోని మహాత్మా గాంధీ ఆసుపత్రి సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్లు ఉండడాన్ని లోకో పైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపి వేశాడు.
రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రైలును పట్టాలు తప్పించాలనే స్పష్టమైన ఉద్దేశ్యంతో ఇనుప రాడ్లను ట్రాక్ పై ఉంచారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. 5 అడుగుల పొడవున్న ఆరు ఇనుప రాడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్‌పై ఉంచారని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనతో రైలు దాదాపు 35 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సహాయంతో ట్రాక్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ట్రాక్ సురక్షితమని ప్రకటించిన తరువాత, ట్రైయిన్ బయలుదేని వెళ్లింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

