స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా-ట్రంప్
తత్వం భొధపడితే,నెత్తినకెక్కిన తట్టలు క్రింద పడతాయి…
అమరావతి: భారత్,, అమెరికా మధ్య నిలిచిన వ్యాపార ఒప్పందలకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది.. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు..ఇందుకు ప్రధాన మంత్రి నరేద్ర మోదీ కూడా సానుకూలంగా స్పందిస్తూ, తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు..
స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో:- అమెరికా ఎలాగైన భారతదేశంను లొంగతీసుకునేందుకు,రష్యా చమురు అనే పేరుతో భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తూ రావడంతో, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చలు ఆర్దంతరం నిలచిపోయాయి..ఇదే సమయంలో ఇటీవల బ్రిక్స్ దేశాల సదస్సులో భారత్,,రష్యా,,చైనాలు దగ్గర కావడంతో,,అమెరికాకు తత్వం భొధ పడింది.. ఈ నేపథ్యంలోనే ఆ వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పై విధంగా స్పందించా.. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య అడ్డకుంలను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని వెల్లడించారు..రాబోయే రోజుల్లో తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.. రెండు దేశాల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించారు..ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు పలికేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నానని పేర్కొన్నారు..
భారత్, అమెరికాలు:- భారత్‌తో వాణిజ్య చర్చల గురించి ట్రంప్ చేసిన పోస్టుపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తూ, భారత్, అమెరికాలు దగ్గర స్నేహ దేశాలని,, సహజ భాగస్వాములని ప్రధాని మోదీ వ్యాఖ్యనించారు..ఇరుదేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తొందరలోనే తొలగిపోతాయని అకాంక్షించారు..తమ దేశాల మధ్య సంబంధం మరింత బలపడతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు..