NATIONALOTHERSWORLD

ఇజ్రాయెల్ భీకర దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మహ్మద్‌ రాడ్‌ మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేన్ మృతికి ప్రతీకారంగా లెబానాన్ నుంచి ఇజ్రాయిల్ పై మిసైల్ దాడులు చేస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థను పూర్తిగా అంతమొందించే దిశగా ఇజ్రాయిల్ దాడులు చేస్తొంది. ఈ నేపద్యంలోనే…

అమరావతి: పశ్చిమాసియా దేశాలైన లెబనాన్ లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌ ప్రాంతంలోని హెజ్‌బొల్లా స్థావరాలపై సోమవారం ఇజ్రాయెల్‌ రక్షణ దళం (IDF) జరిపిన భీకరవైమానిక దాడుల్లో లెబనాన్‌ పార్లమెంట్‌లోని హెజ్‌బొల్లా బ్లాక్‌ అధిపతి మహ్మద్‌ రాడ్‌ మరణించారు. ఆయన మృతి చెందినట్లు సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్త ‘అల్ హదత్’ వెల్లడించింది. ఈ దాడుల్లో మహ్మద్‌ రాడ్‌ మృతి చెందారు. హెజ్‌బొల్లా ఉగ్రసంస్థకు చెందిన మరికొందరు ఉన్నతాధికారులు కూడా తమ దాడుల్లో మృతి చెందారని ఐడీఎఫ్‌ తెలిపింది. అయితే వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 31 మంది మృతిచెందగా,149 మంది గాయపడినట్లు లెబనాన్‌ ప్రకటించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *