ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు బెయిల్
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది.. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది..ఐదున్నర నెలల తరువాత తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కానున్నారు..బెయిల్ పై కోర్టు పలు షరతులను విధించింది.. రూ.10 లక్షలు పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల సెక్యూరిటీ సంతకాలు చేయించాలని స్పష్టం చేసింది..అలాగే ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలని,,సాక్ష్యాలను టాంపర్ చేయకూడదని షరతులు విధించింది..లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్‌కు వెళ్లకూడదని కోర్టు నిబంధన విధించింది..అంతేకాదు గవర్నర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని స్పష్టం చేసింది..ఈ కేసుపై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, సాక్షులతో మాట్లాడకూదని తెలిపింది.

