NATIONALOTHERSWORLD

గాజాలో 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో వున్న టన్నెల్‌ను గుర్తించిన ఇజ్రాయిల్

అమరావతి: హమస్ ను పూర్తిగా అంతమొందించే వరకు దాడులు అపేదిలేదని స్పష్టం చేసిన ఇజ్రాయిల్,,ఆ దిశగానే దాడులు చేస్తొంది..ఈ నేపధ్యంలో…. ఇజ్రాయెల్‌ దళాలు గాజాలో హమాస్‌కు చెందిన భారీ టన్నెల్‌ను గుర్తించాయి..దాదాపు 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో ఈ టన్నెల్‌ను నిర్మించినట్లు IDF గుర్తించాయి.. హమాస్‌,, 80 రూమ్‌లతో ప్రత్యేక సదుపాయాలను నిర్మించుకుంది.జ వెస్ట్రన్‌ టాయ్‌లెట్స్‌ తో కూడిన బాత్రూమ్‌లు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు, దీర్ఘకాలిక నివాసాలతో పాటూ భారీగా ఆయుధ నిల్వలను IDF ఈ టన్నెల్‌లో గుర్తించింది..

అత్యంత భారీ సొరంగం:- గాజాలో ఇప్పటిదాకా బయటపడ్డ అత్యంత భారీ సొరంగం ఇదే కావడం గమనించ తగ్గ విషయం..ఇందులో మొహమ్మద్‌ సిన్వర్‌, మొహమ్మద్‌ షబానా సహా హమాస్‌ కీలక నేతలు తలదాచుకునేవారని ఇజ్రాయెల్‌ దళాలు నిర్ధరించాయి.. అఅగే గతంలో హమస్ అపహరించించిన IDF అధికారి లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్‌ను కూడా ఇక్కడే బంధించినట్లు ఇజ్రాయెల్‌ కనుగొన్నది..అక్కడ గోల్డిన్‌కు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంది..

సున్నితమైన ప్రాంతాల ద్వారా:- ఒక వేళ ఇజ్రాయిల్ దళాలు దాడులు చేస్తే,,ప్రపంచ దేశాలన సానూభూతినే పొందేందుకు ఈ సొరంగంను ఎక్కువ జనసాంద్రత కలిగిన రఫా ప్రాంతంలో గుర్తించారు..UNRWA (యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్) కంపౌండ్, మసీదులు, ఆసుపత్రుల పాఠశాలలు వుండే సున్నితమైన ప్రాంతాల ద్వారా ఈ టన్నెల్‌ వెళుతుందని IDF వెల్లడించింది..ఈ సొరంగంలో ఏకంగా ఓ నగరాన్నే నిర్మించుకున్నారని,, లోపల అత్యంతక్లిష్టమైన పరిస్థితులు ఉన్నట్లు ఐడిఎఫ్ దళాలు తెలిపాయి.. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఐడీఎఫ్‌ దళాలు సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *