NATIONALOTHERSWORLD

ఇరాన్‌ లొని అణ్వాయుధ కేంద్రాలపై ఆక‌స్మిక వైమానిక దాడలు చేసిన ఇజ్రాయిల్

అమరావతి: ఇజ్రాయిల్ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాలు, అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను, సీనియ‌ర్ మిలిట‌రీ వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తూ వైమానికి దాడులను చేసింది..త‌ము చేపట్టిన ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిందని,,అణ్వాయుధుల‌ను ఇరాన్ డెవ‌ల‌ప్ చేస్తున్నందున దాడులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయిల్ పేర్కొంది.. ఇరాన్‌పై జ‌రిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు పాల్గొన్న‌ట్లు ఇజ్రాయిల్ మిలిట‌రీ వెల్లడించింది..ఫైట‌ర్ విమానాలు 330 బాంబుల‌ను జార విడిచాయని,,దాదాపు 100 ప్ర‌దేశాల్లో వాటిని పేల్చిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది..తమ దేశంపై జరిగిన దాడులకు ప్ర‌తీకారంగా ఇరాన్‌ 100 డ్రోన్ల‌తో  అటాక్ చేసిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది..ఇరాన్  దాడుల‌ను తిప్పికొట్టేందుకు సిద్దంగా వున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది.

ఇద్దరు కీలక అధికారులు మృతి:- ఆప‌రేష‌న్ రైజింగ్ లయ‌న్ పేరుతో ఇరాన్‌పై,, ఇజ్రాయిల్‌ దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్ర‌ధాని నెతాన్య‌హూ ద్రువీక‌రించారు..ఇజ్రాయిల్ జ‌రిపిన దాడిలో ఇరాన్ సైనిక బ‌ల‌గాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ మొహ‌మ్మ‌ద్ భ‌గేరి మృతిచెందారు..ఈ దాడుల్లో ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ జ‌న‌ర‌ల్ హుస్సేన్ స‌లామీ కూడా మృతిచెందారు..అలాగే న‌టాంజ్‌లో ఉన్న అణు శుద్దీక‌ర‌ణ కేంద్రాన్ని,,అందులో పనిచేస్తున్న అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను కూడా దాడుల్లో టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది..ఇరాన్ చేప‌డుతున్న బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌కు,,న‌టాంజ్ ప్ర‌ధాన కేంద్రం..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *