NATIONALOTHERSWORLD

ఇరాన్‌పై భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్,అమెరికాలు

అమరావతి: ఇరాన్‌పై శనివారం భీకర దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్, టెహ్రాన్‌పై క్షిప‌ణుల వ‌ర్షం కురిపించింది. అమెరికా స‌హ‌కారంతో ఈ దాడులు జ‌రిగిన‌ట్లు అంతర్జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. శనివారం ఇజ్రాయిల్ ప్రయోగించిన క్షిప‌ణులు ఇరాక్ భూభాగం మీదుగా ప్ర‌యాణించి,ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో టార్గెట్‌ను ధ్వసం చేశాయి. ఇరాన్ లోని టార్గెట్స్ ను ధ్వసం చేసేందుకు ఇజ్రాయెల్ కొన్ని నెల‌ల క్రిత‌మే ప్లాన్ సిద్దం చేసినట్లు సెక్యూర్టీ అధికారి పేర్కొన్నారు.

ఇరాన్ సుప్రీంనేత అయ‌తుల్లా:- టెహ్రాన్‌లో ఉన్న ఆ దేశ సుప్రీంనేత అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ నివాసంపై దాడులు చేసిన‌ట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని పాస్చేర్ జిల్లాలో పేలుళ్ల శ‌బ్ధాలు వినిపించాయి. చాలా అత్యంత భద్రతతో కూడిన  కాంపౌండ్ ఉన్న నివాసం, ఆఫీసుపై అటాక్ జ‌రిగింది. న్యూస్ ఏజెన్సీ ప్ర‌కారం సుమారు ఆ ప్రాంతంపై ఏడు మిస్సైళ్ల‌తో దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల తరువాత ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. బంకర్‌ లోకి ఆయన వెళ్లిపోయినట్లు సమాచారం.

అమెరికా:- ఇరాన్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాక‌పోవ‌డం ప‌ట్ల ట్రంప్ అసంతృప్తితో ఉన్నారు. ఇరాన్ అణ్వాయుధాల‌ను స‌మీక‌రించ‌డాన్ని ఆయ‌న వ్య‌తిరేకిస్తున్నారు. యురేనియం శుద్దీక‌ర‌ణ సామర్థ్యాన్ని ఇరాన్ క‌లిగి ఉండ‌టాన్ని అమెరికా త‌ప్పుప‌డుతు వస్తొంది. ఏదో ఒక ద‌శ‌లో సైనిక బ‌లాన్ని వాడాల్సి వ‌స్తుంద‌ని గురువార‌మే ట్రంప్ హెచ్చరించారు.

ప్రతిదాడులు ప్రారంభించిన ఇరాన్:- ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు ప్రారంభించింది.70 ఖండాంతర క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చేస్తునట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. ఇరాన్‌ డిఫెన్స్‌ సిస్టంపైనా ఇజ్రాయెల్‌ దాడులు చేసినట్లు తెలుస్తోంది. డిఫెన్స్‌ సిస్టమ్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *