బెంగళూరులో 10 ఏళ్లకు రూ.1,000 కోట్లు అద్దెగా చెల్లించనున్న ఐఫోన్ సంస్థ
రూ.6.3 కోట్లకు అద్దె తీసుకుని ఆపిల్..
అమరావతి: భారత్‌లో ఐఫోన్ల తయారీని భారీగా పెంచడంపై దృష్టి సారించిన యాపిల్ సంస్థ,, తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగవంతం చేస్తొంది..దేశీయంగా ఐఫోన్ ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించిన యాపిల్ సంస్థ ఇందుకు అనుగుణంగా బెంగళూరులో ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది..ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎంబసీ గ్రూప్ కు చెందిన కమర్షియల్ ప్రాజెక్టు ఎంబసీ జెనిత్ లోని ఆ కార్యాలయ స్థలం కోసం 10 ఏళ్ల కాలానికి యాపిల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.. 5 నుంచి 13వ అంతస్తు వరకు ఆఫీస్ స్పేస్ కోసం యాపిల్ సంస్థ నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించనుంది.. ఏడాదికి 4.5 శాతం చొప్పున అద్దె పెంపుతో పార్కింగ్, మెయింటెనెన్స్ చార్జీలతో కలిపి మొత్తం 10 సంవత్సరాల్లో సంస్థ రూ.1,000 కోట్లను అద్దెగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది..2025 ఏప్రిల్ 3 నుంచి ఈ లీజు అమల్లోకి వచ్చింది.. ఈ లీజు ఒప్పందంలో భాగంగా యాపిల్ రూ.31.57 కోట్లు డిపాజిట్ కూడా చేసింది..2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది..