5 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఇంటెల్
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాలు చేస్తున్న వారికి కష్టకాలం మొదలైనట్లు కన్పిస్తొంది..కంపెనీలకు ఆర్థిక సమస్యలు,,గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులు,,ఏఐ వినియోగం పెరగడంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కొత ప్రారంభించాయి.. ఇందులో భాగంగా చిప్ తయారీ సంస్థ ఇంటెల్, 5 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది..ఈ వారంలోనే అమెరికా వ్యాప్తంగా తొలగింపులు ఉంటాయని స్పష్టం చేసింది.. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా లే ఆఫ్‌లు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.. ఒరెగాన్, కాలిఫోర్నియాలో ఎక్కువగా తొలగింపులు ఉంటాయని పేర్కొంది..ఈ సంవత్సరం మార్చిలో ఇంటెల్ కొత్త సీఈఓగా లిప్-బు టాన్ బాధ్యతలు స్వీకరించారు..కంపెనీపై ఆర్దిక భారం తగ్గించేందుకు ఆయన ఆధ్వర్యంలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్న ఇంటెల్ సంస్థ తన ఉద్యోగుల్లో 20 శాతానికి పైగా తొలగించేందుకు చర్యలను ప్రకటించింది..రాబోయే రోజుల్లో సాప్ట్ వేర్ ఉద్యోగులు కొత్త టెక్నాలాజీని అందిపుచ్చుకోకుంటే….బెంచ్ పై కుర్చోవాల్సిందే..?