ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం భారతదేశంకు తెలుసు-ప్రధాని మోదీ
ఆత్మనిర్భర భారత్..
అమరావతి: ప్రపంచంలో భారతదేశానికి ఏకైక శత్రువు అంటే,, ఇతర దేశాలపై ఆధారపడటమే..ఇలాంటి శ్రతువును ఎదుర్కొవాలంటే ఇతర దేశాలపై ఆధారపడడాన్ని భారతదేశం తగ్గించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.శనివారం గుజరాత్ లోని భావ్ నగర్ లో ప్రధాని మోదీ పర్యటించారు..రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి,,మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు..ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మనం ఇతరులపై ఎంత ఎక్కువగా ఆధారపడతామో,,అంతగా వైఫల్యం చెందుతామని,అదే సమయంలో మన ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు..
H-1B వీసాలపై లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు.. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము విధించటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు..కరోనా సమయంలోను మనం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనం,,ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం భారతదేశంకు తెలుసు అని అన్నారు.. (H1B Visa Fee) లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు.. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి..అయితే H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు లక్ష డాలర్ల దరఖాస్తు రుసుంపై అమెరికాలోని న్యాయవాదులు కోర్టుల తలుపులు తట్టనున్నారు..అమెరికా పార్లమెంట్ H-1B,, H-4 వీసాలు,,తదితర బిల్లులను పాస్ చేసింది..పార్లమెంట్ అమోదం లేకుండానే డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం పెట్టినంత మాత్రన,సదరు చట్టం శాశ్వతంగా అమల్లోకి రాదు అని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.
ఒకే ఒక ఔషధం ఆత్మనిర్భర భారత్:- 140 కోట్ల ప్రజల భవిష్యత్తును ఇతరులకు అప్పగించలేం అలాగే భవిష్యత్ తరాల మేధస్సును,,అభివృద్దిని ఫణంగా పెట్టలేమన్నారు..సెమీకండెక్టర్ చిప్స్ నుంచి ఓడల వరకు మనం స్వయంగా దేశీయంగా తయారు చేయాలని,, శాంతి, స్థిరత్వం, సంపద కోసం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం స్వావలంబన పొందాలన్నారు..ఇలాంటి అన్ని సమస్యలకు ఒకే ఒక ఔషధం ఉందని అదే ఆత్మనిర్భర భారత్ అని మోదీ పేర్కొన్నారు.
నీతి ఆయోగ్–భారత్‌కు లాభమే:- ట్రంప్ తీసుకున్న H-1B వీసాలపై అధిక రుసుము నిర్ణయం అంతర్జాతీయ టాలెంట్‌కు తలుపు మూయటం లాంటిదని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు.. అది అమెరికాకు తీరని నష్టమని, భారత్‌కు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.. బెంగళూరు, హైదరాబాద్, పుణె, గురుగ్రామ్ లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త స్టార్ట్ అప్స్ మొదలవుతాయని చెప్పారు..వివిధ రకాల టెక్నికల్ ల్యాబ్స్ ప్రారంభం అవుతాయని,, అమెరికాలో జరిగాల్సిన అభివృద్ధి ఇండియాలో జరుగుతుందన్నారు.. భారత దేశానికి చెందిన టాప్ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఇండియా కోసం పని చేసే అవకాశం లభిస్తుందని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
వెలుపల వున్న వారు 24 గంటల్లోపు తిరిగి యూఎస్‌కు:- H-1B Visa విషయంలో ట్రంప్ తాజా నిర్ణయంతో మైక్రోసాఫ్ట్ (Microsoft),, మెటా (Meta ) వంటి ప్రధాన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి..H-1B వీసాదారులందరూ కనీసం 14 రోజుల పాటూ అమెరికాను విడిచి వెళ్లొద్దని సూచించాయి.. ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులు 24 గంటల్లోపు తిరిగి యూఎస్‌కు రావాలని ఆదేశించాయి.. అమెరికాలో తమ భవిష్యత్తు కోసం విదేశీ ఉద్యోగులు ఈ ఆదేశాలను పాటించాలని కోరాయి.. ఈ మేరకు ఉద్యోగులకు ఆయా సంస్థలు అంతర్గత మెయిల్స్ పంపినట్లు తెలిసింది..H-1B,,H-4వీసాదారులు 24 గంటల్లోపు అంటే సెప్టెంబర్ 21 లోపు ఆలస్యం చేయకుండా అమెరికాకు తిరిగి వచ్చేయాలని సూచించాయి.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం..2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి అమెజాన్ దాదాపు 10,044 హెచ్-1బీ వీసాలను ఉపయోగించింది..ఆ తర్వాత టీసీఎస్ 5,505, మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951), ఒరాకిల్ (2,092), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (2,347), కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (2,493), వాల్‌మార్ట్ అసోసియేట్స్ (2,390) హెచ్-1బీ వీసాలను దక్కించుకున్నాయి. ఇవే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా హెచ్-1బీ వీసాలతో ఎక్కువమంది భారతీయులను నియమించుకుంటున్నాయి.. వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం వుంది.