NATIONALOTHERSTECHNOLOGY

పాక్స్ సిలికా కూటమిలో చేరిన భారత్-చారిత్రాత్మకమైన ఒప్పందం

అమరావతి: భారత్‌దేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్- కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో పాక్స్ సిలికా కూటమికి సంబంధించిన చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశారు. శుక్రవారం భారతదేశం-అమెరికా నేతృత్వంలోని పాక్స్ సిలికా కూటమిలో చేరింది. అమెరికా డిసెంబర్ 2025లో పాక్స్ సిలికాను ప్రారంభించింది.సెమీకండక్టర్లు (చిప్స్), కృత్రిమ మేధస్సు (AI) వంటి కీలకమైన ఖనిజాల కోసం ప్రపంచ సరఫరా వ్యవస్థను  సురక్షితమైన,అటంకంలేని విధంగా బలోపేతం చేయడానికి ఈ కూటమిని రూపొందించారు. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ అలాగే సాంకేతిక ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఈ కూటమి ఏర్పడింది.ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో చైనా ప్రధాన పాత్ర పోషించింది.

భారతదేశం చేరిక కూటమిని మరింత బలోపేతం:- ఈ గ్రూపులో రావల్సిందిగా భారతదేశాన్ని ఆహ్వానించారు. అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇజ్రాయెల్, UK, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ సాంకేతిక ఆవిష్కరణలు, చిప్ ఉత్పత్తి, AI పరిశోధన వంటి కీలకమైన ఖనిజ వనరులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశం చేరిక ఈ కూటమిని మరింత బలోపేతం చేస్తుంది. ఇది భారతదేశ సెమీకండక్టర్ మిషన్, AI రంగానికి ఒక ప్రధాన అవకాశంగా పరిగణిస్తున్నారు. సెమీకండక్టర్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే వివిధ విధానాలను అమలు చేసింది. పాక్స్ సిలికా కూటమిలో చేరడం వల్ల భారతదేశానికి సాంకేతిక సహకారం, పెట్టుబడి, పరిశోధన భాగస్వామ్యాలు, సరఫరా చైన్ డిమాండ్ కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇది భారతదేశంలో చిప్ తయారీ, డిజైన్, AI-ఆధారిత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తూంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *