NATIONAL

భారత్‌ నేడు ఒలింపిక్స్‌,ఒలింపియాడ్‌లో ముందుకెళ్తోంది-ప్రధాని మోదీ

124 ఎసిసోడ్‌“మన్‌ కీ బాత్‌”..

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 124 ఎసిసోడ్‌“మన్‌ కీ బాత్‌” కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించారు.. విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక, భారత్‌ సాధించి అభివృద్దిపై ప్రధాని మాట్లాడారు..ఇటీవల కాలంలో భారత్‌లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయని,,అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు..శుభాన్షు శుక్లా ISSకు వెళ్లి,, భూమిపైకి చేరుకోగానే దేశమంతా ఆనందంతో, గర్వంతో నిండిపోయిందని మోదీ పేర్కొన్నారు.. చంద్రయాన్‌-3ని విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్‌ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడిందన్నారు..ప్రస్తుతం విద్యార్దుల్లో సైన్స్‌ పై ఆసక్తి చూపుతున్నారన్నారు..ఇన్‌స్పైర్‌ మనక్‌ అభియాన్‌ గురించి ప్రధాని మాట్లాడారు.. ఈ పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమని తెలిపారు.. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు..

ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్‌:- భారత్‌లో ఐదేళ్ల క్రితం దేశంలో 50 కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండేవని,,ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయని వివరించారు..ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు.. ముంబయిలో వచ్చే నెల జరుగబోయే ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్‌ ఒలింపియాడ్ జరుగునుందని చెప్పారు.. భారత్‌ ఇప్పుడు ఒలింపిక్స్‌, ఒలింపియాడ్‌లో ముందుకెళ్తోందన్నారు.. యునెస్కో 12 మరాఠా కోటలను ప్రపంచవారసత్వ స్థలాలుగా గుర్తించిందని,, ఇందులో 11 మహారాష్ట్రలో, ఒకటి తమిళనాడులో ఉన్నాయన్నారు.. సల్హేర్ కోటలో మొఘలులు ఓడిపోయారని,, ఛత్రపతి శివాజీ మహారాజ్ శివనేరిలో జన్మించారన్నారు..ఖండేరిలో సముద్రం మధ్యలో ఒక కోట ఉందని,,శత్రువు ఆయనను రానివ్వకుండా అడ్డుకోవాలని చూసిన శివాజీ మహారాజ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడని తెలిపారు.. ప్రతాప్‌గఢ్ కోటలో అఫ్జల్ ఖాన్ ఓడిపోగా,, విజయదుర్గ్‌ లో రహస్య రంగాలున్నాయని,, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ దూరదృష్టికి ఈ కోట సాక్ష్యంగా నిలుస్తుందన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *