మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ 28 శాతం అభివృద్ది సాధించింది-ప్రధాని మోదీ
అమరావతి: దేశంలో మొబైల్ తయారీ రంగం గడచిన 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా&పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం దిల్లీలో అక్టోబర్ 8 నుంచి 11 వరకు జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 9వ ఎడిషన్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు.అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, మొబైల్ ఫోన్ల తయారీలో 28 శాతం,, ఎగుమతుల్లో 127 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. దేశంలో 1GB వైర్‌లెస్ డేటా ఖరీదు ఒక కప్పు టీ కంటే తక్కువ అని అన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో బాగంగా ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం అని ప్రధాని మోదీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. పెట్టుబడులకు అనుకూల దేశమనే పేరు రావటానికి సులభతర వాణిజ్య విధానాలు దోహదం చేశాయని చెప్పారు.
ప్రపంచంలోని ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా:- కేంద్ర ప్రభుత్వం మద్దతుతో సెమీకండక్టర్ల ఉత్పత్తి,, మొబైల్ టెక్నాలజీ,,స్టార్టప్‌లు అనేక రంగాల్లో కలిసి పనిచేస్తుండడంతో ప్రతి రంగంలోనూ భారత్ దూసుకుపోతోందన్నారు. కొన్ని రోజుల క్రితం స్వదేశీ పరిజ్ఞారంతో రూపొందించిన 4G టెక్నాలజీని అవిష్కరించామని వెల్లడించారు. ఫలితంగా ఈ సాంకేతికత కలిగిన ప్రపంచంలోని ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. ఆత్మ నిర్భరత,, స్వాతంత్ర్యంగా సాంకేతికతను అభివృద్ది చేసే దిశగా అడుగులు వేశామన్నారు. 4G, 5G సాంకేతికతో దేశంలోని ప్రతి ఒక్కరికి నిరంతరాయ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తాం అని ప్రధాని మోదీ తెలిపారు.