NATIONALOTHERSWORLD

ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలకు ధీటైన జవాబు ఇచ్చిన భారతదేశం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది..ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..ప్రధాన మంత్రి (PM) ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది..ఇందు కోసం రూ.12,060 కోట్లు కేటాయింపులు,,అసోం,, త్రిపురలకు రూ.7,250 కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.. సాంకేతిక విద్య కోసం రూ.4,200 కోట్లతో ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల అప్‌గ్రేడ్‌కు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటిచింది..ప్రపంచ మార్కెట్స్ లో LPG ధర ఎక్కువగా వున్పప్పటికి,, ప్రభుత్వ రంగ కంపెనీలు అయిన IOCL, BPCL, HPCLలు దేశీయంగా నిర్ణయించన ధరలకు అమ్మడంతో,, గ్యాస్ కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి..సదరు కంపెనీలకు పరిహారం చెల్లించేందుకు రూ.30,000 కోట్లు కేటాయించినట్లు తెలుస్తొంది.. మరక్కనం- పుదుచ్చేరి 4-లైన్ హైవే కోసం రూ.2,157 కోట్లు కేటాయించినట్లు తెలిసింది.

50 శాతం సుంకాలకు ధీటైన జవాబు:- ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలకు భారత్‌ దీటైన జవాబు ఇస్తు,, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేసినట్లు భారత్ ప్రకటించింది..ఇప్పటికే అమెరికా క్షిపణుల కొనుగోళ్లు భారత్‌ నిలిపివేసింది.. భారత్ 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-8I మారిటైమ్ పెట్రోల్ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి..2021లో 2.42 బిలియన్ డాలర్లకు ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపారు.. ట్రంప్ విధించిన టారిఫ్‌లు,, ద్రవ్యోల్బణం,, ఇతర కారణాల వల్ల దాదాపు 50%  ఖర్చు పెరిగి 3.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.. భారత ప్రభుత్వం నుంచి ఈ ఒప్పందం నిలిపివేతపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదని వార్త సంస్థలు పేర్కొంటున్నాయి..ఈ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *