NATIONAL

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది-ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశంకు పురాతన వ్యూహాత్మక భాగస్వామిగా ఫ్రాన్స్‌ కొనసాగుతోందని,,రఫేల్‌ జెట్‌ల నుంచి సబ్‌మెరైన్‌ వరకు రక్షణ రంగంలో సహకారం అందించుకుంటున్నామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం మహారాష్ట్ర లోక్‌భవన్‌కు చేరుకుని మెక్రాన్‌కు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. మూడు రోజుల భారతదేశ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లు వెల్లడించారు. ఎవరెస్టంత ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్లను ఫ్రాన్స్‌ సహకారంతో భారత్‌లోనే తయారు చేయనున్నాం. యావత్‌ ప్రపంచానికి ఇక్కడ నుంచే ఎగుమతి అవుతాయ వెల్లడించారు. భౌగోళిక రాజకీయ తిరుగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సహకారం గణనీయంగా పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్‌ H-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌ను నేతలు ఇరువురు వర్చువల్‌గా ప్రారంభించారు. అరుదైన ఖనిజాలు, బయోటెక్నాలజీ, అడ్వాన్స్‌ మెటీరియల్‌ వంటి రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఐ ఆధారిత ఇండో-ఫ్రెంచ్ సెంటర్, ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఆఫ్ అలయన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్‌ సంస్థలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇవి కేవలం సంస్థలు కాదని భవిష్యత్‌ నిర్మాణ వేదికలను ప్రధాని మోదీ ప్రకటించారు. మెక్రాన్ భారత్ పర్యటనలో భాగంగా ఈనెల 19న ఢిల్లీలో జరిగే ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొంటారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *