NATIONAL

గూగుల్ మ్యాప్స్ ను నమ్మకుంటే మీతో పాటు మీ కారు మునుగుతుంది,తస్మాత్ జాగ్రత్త..

అమరావతి: గూగుల్ మ్యాప్స్ ను నమ్మకుని తెలియని ప్రదేశాల్లో కారు డ్రైవింగ్ చేస్తే,,మీ ప్రాణాలకు ఆపాయం వున్నట్లే లెక్క..ఇందుకు ఎన్నో ఉదాహరణలు వున్నాయి..ఈ నేపధ్యంలోనే….నవీ ముంబైలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న మహిళ తన కారుతో సహా సముద్రంలో (బేలో) పడిపోయింది.. శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో నవీ ముంబైలోని బేలాపూర్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన కారుతో పాటు బేలో పడిపోయింది..సదరు మహిళ బేలాపూర్ నుంచి ఉల్వేకు, గూగుల్ మ్యాప్స్‌ సాయంతో ప్రయాణిస్తుండగా,, గూగుల్ మ్యాప్స్‌,, ఆమెకు వంతెన పైన ఉన్న మార్గం చూపించకుండా,,వంతెన కింద ఉన్న డైరక్షన్ చూపించింది..గుడ్డిగా గూగుల్ మ్యాప్స్‌ ను ఫాలో అవుతున్న మహిళ వెళ్లి నేరుగా బేలో పడిపోయింది..అమె అదృష్టం బాగుండడంతో అక్కడే గస్తీలో ఉన్న మెరైన్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఈ సంఘటనను గమనించారు.. సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది,,బే దగ్గరకు వచ్చి కారును గమనించగా,,సదరు మహిళ కారులో తేలుతున్నట్లు గుర్తించారు.. వెంటనే సెక్యూరిటీ గార్డులు బేలోకి దూకి,,కారులోకి వెళ్లి,, ఆమెను బయటకు తీసుకొచ్చారు..సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు..ఆ ప్రాంతంకు చేరుకున్న క్రేన్ సహాయంతో కారును కూడా బయటకు తీశారు..సదరు మహిళను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు..దినిని పట్టి చూస్తే,, గూగుల్ మ్యాప్స్‌ ను నమ్మకుని గుడ్డిగా డ్రైవింగ్ చేస్తే,,మీరు ఎక్కడో ఒక దగ్గర నదిలోనో,,ఇలాంటి బే లోనో,,లేక పోతే లోయ లోనో పడిపోవడం ఖాయం..??? తస్మాత్ జాగ్రత్త..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *