భారత్ బ్రహ్మోస్ క్షిపణులను గురించి తెలియని దేశాలు ఉంటే,పాకిస్థాన్ ను అడగండి-యోగీ
అమరావతి: పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో తొలి సారిగా భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు..ఈ క్షిపణులకున్న శక్తి గురించి ప్రపంచ దేశాలకు ప్రస్తుతం తెలిసిందని,,అయినప్పటికి దీని ప్రభావం గురించి తెలియని వారెవరైనా ఉంటే, పాకిస్థాన్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు..ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్,లక్నో సిటీలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ తయారీ కేంద్రాని,,లక్నోలోని ‘ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’లో నిర్మించిన ఈ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొని మాట్లాడారు..ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని సీఎం యోగి తెలిపారు.. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్‌లో ప్రతి సంవత్సరం 80 నుంచి 100 క్షిపణులను తయారు చేయనున్నట్లు వెల్లడించారు.. బ్రహ్మోస్ క్షిపణులు 290 నుంచి 400 కి.మీ పరిధిని,, మాక్ 2.8 రెట్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయని తెలిపారు..ఈ సందర్బంలో ఉగ్రవాదం గురించి సీఎం యోగి మాట్లాడతూ “ఉగ్రవాదం కుక్కతోక లాంటిది…అది ఎప్పుడూ వంకరగానే ఉంటుంది…దాన్ని సరిచేయాలంటే వాటి సొంత భాషలోనే సమాధానం ఇవ్వాలి” అని వ్యాఖ్యానించారు.